నా తల్లిదండ్రుల నుంచి ప్రాణ రక్షణ కల్పించండి | Lovers Complaint on Parents in Krishna | Sakshi
Sakshi News home page

నా తల్లిదండ్రుల నుంచి ప్రాణ రక్షణ కల్పించండి

Apr 24 2019 11:14 AM | Updated on Jul 10 2019 7:55 PM

Lovers Complaint on Parents in Krishna - Sakshi

మాట్లాడుతున్న ప్రేమ జంట బి.ఉష, యువరాజ్‌

ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని బెదిరిస్తున్నారు

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని నా భర్తను చంపేస్తామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామం రామ్‌నగర్‌కు చెందిన బి.ఉష ఆరోపించింది. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో భర్త యువరాజ్‌తో కలసి ఉష మీడియాతో మాట్లాడారు.

మూడేళ్లుగా ప్రేమించుకుని పెద్దలకు తెలియజేశాం. మా పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. తల్లిదండ్రలు అర్థం చేసుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లి ఈనెల 17న పులివెందులలో ఓ దేవాలయంలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాం. విషయం తెలుసుకున్న మా పెద్దలు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అంటూ మీడియా ఎదుట ఉష తన గోడు వినిపించింది. నా భర్త యువరాజ్‌ తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. చిత్తూ రు వెళితే తమను చంపేస్తారని రక్షణ కల్పించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement