ప్రేమజంట ఆత్మహత్య | Lovers Commit suicide in Khammam District | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Feb 5 2014 12:21 AM | Updated on Sep 2 2017 3:20 AM

ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.

చండ్రుగొండ: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం రేపల్లెవాడలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. రేపల్లెవాడకు చెందిన ఇనుముల రాము (20), ఇరుప పుష్పలత (25) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గిరిజన తెగకు చెందిన పుష్పలత ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేసి ప్రస్తుతం ఊట్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సీఆర్‌టీగా పనిచేస్తోంది.

రాము ఆటో డ్రైవర్ కాగా, పాఠశాలకు రోజూ అతడి ఆటోలోనే వెళ్తున్న క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే వీరి పెళ్లికి ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో సోమవారం సాయంత్రం ఇద్దరూ మద్దుకూరు అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం పశువుల కాపరులు వీరిని చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement