రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య | Lovers commit suicide | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

Jun 24 2016 5:10 PM | Updated on Nov 6 2018 7:56 PM

రైలు కిందపడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

తొండంగి (తూర్పు గోదావరి) : రైలు కిందపడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖకు చెందిన అవంతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మణికంఠ(20), కె.దివ్య(20) శుక్రవారం ఉదయం గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

తుని ఆర్పీఎఫ్ పోలీసుల సమాచారం మేరకు తొండంగి పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి ఆనవాళ్ల ఆధారంగా వారిద్దరూ ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement