ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం | Love couple to commit suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Aug 25 2015 1:53 AM | Updated on Sep 3 2017 8:03 AM

పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారన్న కారణంగా ప్రేమంజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ

చికిత్స పొందుతూ మృతిచెందిన యువతి
ఆస్పత్రిలో కోలుకుంటున్న యువకుడు

 
నక్కపల్లి/పాయకరావుపేట:పెళ్లికితల్లిదండ్రులు నిరాకరిస్తున్నారన్న కారణంగా ప్రేమంజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడగా, యువకుడు తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి సత్తిబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామానికి చెందిన ఉలవకాయల పార్వతి(21) అదేగ్రామానికిచెందిన వేముల నరేంద్రలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేనత్త మేనమామపిల్లలు,పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్వతి తల్లిదండ్రులు ఆమెకు బయట వ్యక్తితో వివాహం చేయడానికి సంబంధాలుచూస్తున్నారు.

ఈ విషయం తెలిసిన ప్రేమికులిద్దరూ ఈనెల 22న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరూ సమీపంలో ఉన్న తోటలో పడిఉండటాన్ని చూసి బంధువులు తుని  ఏరియా ఆస్పత్రికి తరలించారు. యవతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడకు తీసుకెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో ఆమె మృతి చెందినట్లు తండ్రి సత్తిబాబు పోలీసులకు తెలిపాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement