మద్యం డిపో వద్ద లారీ డ్రైవర్ల ఆందోళన | lorry drivers protest at liquor depot | Sakshi
Sakshi News home page

మద్యం డిపో వద్ద లారీ డ్రైవర్ల ఆందోళన

Jan 29 2016 1:32 PM | Updated on Sep 3 2017 4:34 PM

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యూనిట్ ముందు లారీ డ్రైవర్లు శుక్రవారం నిరసనకు దిగారు.

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యూనిట్ ముందు లారీ డ్రైవర్లు శుక్రవారం నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఇక్కడి యూనిట్‌కు సరఫరా జరుగుతోంది. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలను రోడ్డుపై నిలపడానికి పోలీసులు అనుమతించడం లేదు. అదే సమయంలో డిపోలోకి రావడానికి అధికారులు ఒప్పుకోవడం లేదు. వీరి వైఖరికి నిరసనగా సుమారు 50 లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో మద్యం డిపో అధికారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement