11న శ్రీవారికి దీపావళి ఆస్థానం | lord balaji deepavali aastanam on 11th november | Sakshi
Sakshi News home page

11న శ్రీవారికి దీపావళి ఆస్థానం

Nov 5 2015 8:08 PM | Updated on Sep 3 2017 12:04 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు.

అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేస్తారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement