ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు లైన్‌ క్లియర్‌ | Line clear for Eamcet counselling | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు లైన్‌ క్లియర్‌

Aug 8 2013 4:19 PM | Updated on Sep 1 2017 9:44 PM

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు లైన్‌ క్లియర్‌

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు లైన్‌ క్లియర్‌

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్కు హైకోర్టు పచ్చజెండా ఊపింది.

హైదరాబాద్ : విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్కు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయాయి. ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని  హైకోర్టు గురువారం ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వారం ముందు విడుదల చేయాలని సూచించింది.

యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 12న ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారి. మే 12న ఎంసెట్‌ నిర్వహించగా, జూన్‌ 5న ఫలితాలు వెలువడ్డాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement