అనంత, కర్నూలు, తిరుపతిలో చిరుతల హల్చల్ | leopards create problems in andhra pradesh | Sakshi
Sakshi News home page

అనంత, కర్నూలు, తిరుపతిలో చిరుతల హల్చల్

Jan 15 2015 10:33 AM | Updated on Sep 2 2017 7:46 PM

అనంత, కర్నూలు, తిరుపతిలో చిరుతల హల్చల్

అనంత, కర్నూలు, తిరుపతిలో చిరుతల హల్చల్

అనంతపురం, కర్నూలు, చిత్తూరు,తిరుపతి పట్టణాలలో చిరుతల బెడద తప్పేలా కనిపించడం లేదు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలోని వేదిక్ వర్సిటీ, రుయా ఆస్పత్రి ప్రాంగణాల్లో చిరుత కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. వేదిక్ యూనివర్సిటీ వద్ద  చిరుతల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చిరుతల కోసం బోనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా తిరుపతిలోనే కాదు.. అనంతపురం జిల్లా పెనుకొండలోని.. రాజేశ్వరి కాలనీలో కూడా చిరుత సంచరిస్తున్న్లు తెలుస్తోంది.  పెనుకొండలో గొర్రెల మందపై చిరుత దాడి  చేసింది.  రెండు గొర్రెలు మృతి చెందాయి, అలాగే  కర్నూలు జిల్లా చిరుతన్‌కల్‌లో  కూడా చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. చిరుతల సంచారంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement