కౌలురైతు ఆత్మహత్య | Lease farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలురైతు ఆత్మహత్య

Nov 29 2015 7:17 PM | Updated on Sep 3 2017 1:13 PM

అప్పులు తీరే మార్గం కానరాకపోవడంతో కౌలు రైతు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పులు తీరే మార్గం కానరాకపోవడంతో కౌలు రైతు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడి మెట్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రసాదపు బసవయ్య తనకున్న అరెకరం పొలంతో పాటు. కౌలుకు కొంత పొలం తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది నాలుగు ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో దిగుబడి అనుకున్నంత రాలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక శనివారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.


పొద్దున్నే పొలానికి వెళ్లి వస్తానని వెళ్లిన బసవయ్య సాయంత్రం పొద్దుపోయే వరకూ రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. పొలంలో బసవయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆదివారం ఉదయం రైతు మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. బసవయ్యకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రూ.3 లక్షల మేర అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement