breaking news
basavayya
-
కౌలురైతు ఆత్మహత్య
అప్పులు తీరే మార్గం కానరాకపోవడంతో కౌలు రైతు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడి మెట్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రసాదపు బసవయ్య తనకున్న అరెకరం పొలంతో పాటు. కౌలుకు కొంత పొలం తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది నాలుగు ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో దిగుబడి అనుకున్నంత రాలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక శనివారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొద్దున్నే పొలానికి వెళ్లి వస్తానని వెళ్లిన బసవయ్య సాయంత్రం పొద్దుపోయే వరకూ రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. పొలంలో బసవయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆదివారం ఉదయం రైతు మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. బసవయ్యకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రూ.3 లక్షల మేర అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
సీనియర్ జర్నలిస్ట్ బసవయ్య మృతి
పెనుగొండ/పెనుగొండ రూరల్, న్యూస్‌లైన్ : సీనియర్ జర్నలిస్ట్, ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన ఇవటూరి వెంకట బసవయ్య(57) మంగళవారం ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం సుస్తీ చేయటంతో తణుకు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువ జామున మృతి చెందారు. 1988లో ఉదయం దినపత్రికతో విలేకరిగా జీవితం ప్రారంభించిన బసవయ్య అనంతరం ఆంధ్రప్రభలో పని చేశారు. ప్రస్తుతం వార్త విలేకరిగా ఉన్నారు. బసవయ్యకు కుమారుడు, కుమార్తె సంతానం. పేద కుటుంబం కావడంతో కుమారుడు జీవనోపాధి నిమిత్తం గతేడాది గల్ఫ్ దేశం వెళ్లాడు. మండలంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన బసవయ్య మరణవార్తకు అధికారులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలేటిపాడులోని ఇంటివద్ద ఉంచిన ఆయన మృతదేహాన్ని ఇరగవరం, పెనుగొండ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు.సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పెనుగొండ జెడ్పీటీసీ రొంగల రవికుమార్, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు యాదాల ఆశాజ్యోతి, బిరుదగంటి రత్నరాజు, కడలి మంగాదేవి, కేతా భీముడు, పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కేతా సత్యనారాయణ(సత్తిబాబు) తదితరులు ఉన్నారు. ఆచంట ప్రెస్ క్లబ్ రూ.10వేల ఆర్థిక సాయం ఆచంట నియోజకవర్గ ప్రెస్‌క్లబ్ సభ్యులు బసవయ్య కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు జవ్వాది మోహన వెంకటేశ్వరరావు, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి గుర్రాల శ్రీనివాసరావు, సభ్యులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సంతాపం ఏలూరు (ఫైర్ స్టేషన్ సెంటర్) : సీనియర్ జర్నలిస్ట్ ఐవీ బసవయ్య ఆకస్మిక మృతి పట్ల పలువురు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు వి.భాస్కర నరసింహం, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.భాస్కర నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్ఎన్ రాజు, కొవ్వూరు డివిజనల్ పౌరసంబందాధికారి కె. రామ్మోహనరావు, ఏలూరు డివిజనల్ పౌరసంబందాధికారి ఆర్వీఎస్ రామచంద్రారావు తదితరులు ఉన్నారు.