రేపే మలివిడత పంచాయతీ ఎన్నికలు | last phase elections of panchayat are tomorrow | Sakshi
Sakshi News home page

రేపే మలివిడత పంచాయతీ ఎన్నికలు

Jan 17 2014 2:45 AM | Updated on Aug 14 2018 9:04 PM

జిల్లాలో మలివిడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాయి. 3 సర్పంచ్, రెండు వార్డు స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నారు.

చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో మలివిడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 సర్పంచ్, రెండు వార్డు స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 8 సర్పంచ్, 135 వార్డు సభ్యుల స్థానాలకు గత నెల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

రిజర్వేషన్ల కారణంగా ఐదు పంచాయతీలకు, 47 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 86 వార్డుల్లో సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. 18న జరగనున్న ఎన్నికలకు అధికారులు, సిబ్బందిని నియమిస్తూ కలెక్టర్ రాంగోపాల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

 103 మందికి విధులు..
 పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 11 పోలింగ్ స్టేషన్లలో జరిగే ఎన్నికలకు స్టేజ్-1 అధికారులుగా 33 మందిని, స్టేజ్-2 అధికారులుగా 5 మందిని, పోలింగ్ అధికారులుగా 11 మందిని, 22 మందిని అదనపు పోలింగ్ అధికారులుగా, 32 మందిని ఇతర విధులకు కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఆపై ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటారు.

 ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఇవే
 ఐరాల మండలంలోని నాంపల్లె సర్పంచ్ స్థానానికి ఐదు మంది, తొట్టంబేడు మం డలం కాసరం పంచాయతీకి ఇద్దరు, కేవీబీపురం మండలంలోని పాతపాళెం పంచాయతీకి ఇద్దరు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. పులిచెర్ల మండలం జీ.రామిరెడ్డిగారిపల్లెలో 2వ వార్డుకు, రామకుప్పం మండలం విజలాపురం పంచాయతీలోని 2వ వార్డుకు ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement