బడిబయట పిల్లలందరినీ రాబో యే పది రోజుల్లో రెగ్యులర్ పాఠశాల, కేజీబీవీ, ఆర్‌ఎస్‌టీసీలలో చేర్పించాలని కలెక్టర్ టి.చిరంజీవులు ఆదేశించారు.
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్
బడిబయట పిల్లలందరినీ రాబో యే పది రోజుల్లో రెగ్యులర్ పాఠశాల, కేజీబీవీ, ఆర్‌ఎస్‌టీసీలలో చేర్పించాలని కలెక్టర్ టి.చిరంజీవులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మం దిరంలో సోమవారం ఎంఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బడిబయట పిల్లల నమో దు, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల పనితీరు, ఎస్సెస్సీ ఫలితాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల అంశాలపై సమీక్ష చేశారు. జిల్లాలో నిర్వహించిన సర్వే ప్రకారం 3342 మంది పిల్లలు బడిబయట ఉన్నారన్నారు. బాలకార్మికులందరినీ బడిలో చేర్పించే కార్యక్రమం విజయవంతం చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. మహిళా సమాఖ్యల ద్వా రా 5, ఎన్జీవోల ద్వారా 2 రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు (ఆర్‌ఎస్‌టీసీ)ను అన్ని డివిజన్ కేంద్రాల్లో ప్రారంభిం చినట్లు తెలిపారు. మంగళవారం జరిగే మన గ్రామం కార్యక్రమంలో అన్ని ఎం పీడీఓ కార్యాలయాల్లో దత్తత అధికారులతో సమావేశం నిర్వహించి బడిబయట పిల్లల దత్తత వివరాలను వచ్చే శుక్రవారం నాటికి సమర్పించాలన్నారు.
సీఆర్‌పీలు, ప్రేరక్‌లు, విద్యాభిమాను లు, యువకుల భాగస్వామ్యంతో గ్రామ సర్పంచ్‌లు కలిసి పనిచేయాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. వారానికి రెండుసా ర్లు గుడ్లు అందించాలని అలా పాటిం చని ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై చర్యలు తీసుకుంటామని, ఏజెన్సీలను రద్దు చేస్తామన్నారు. పాఠశాలల్లో గుణాత్మకత, పాఠశాల వాతావరణం పెంపొందేలా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాల న్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. మన కోసం మనం కార్యక్రమంలో భా గంగా నిర్వహిస్తున్న అక్షరాస్యత కేంద్రాలను ఎప్పటికప్పుడు ఎంఈఓలు సందర్శించాలన్నారు. సమావేశంలో డీఈఓ జగదీష్ పాల్గొన్నారు.