కొనసాగుతున్న కూలీ రేట్ల పెంపు వివాదం | labour charges hike conflict continue in visakha | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కూలీ రేట్ల పెంపు వివాదం

Aug 6 2015 7:14 PM | Updated on Sep 3 2017 6:55 AM

హామాలీలు, వ్యాపారులకు మధ్య కూలీ విషయంలో మొదలైన వివాదం ఇంకా సద్దుమణగలేదు.

విశాఖపట్టణం(చోడవరం): హామాలీలు, వ్యాపారులకు మధ్య కూలీ విషయంలో మొదలైన వివాదం ఇంకా సద్దుమణగలేదు. కొన్ని రోజులుగా హామాలీలకు చిరు వ్యాపారులకు మధ్య కూలీ రేట్ల పెంపు విషయమై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా హామాలీలు సమ్మెకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు వ్యాపారులు అనూహ్యంగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రైవేట్ కూలీల సహయంతో సరకు రవాణా చేస్తుంటే కొందరు హామాలీలు అడ్డుకుంటున్నారని వ్యాపారులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement