కోతి తెచ్చిన తంటా | KV Power Wires Cut And Short Circuit in velugodu | Sakshi
Sakshi News home page

కోతి తెచ్చిన తంటా

Mar 7 2018 11:36 AM | Updated on Mar 7 2018 11:36 AM

KV Power Wires Cut And Short Circuit in velugodu - Sakshi

ఆందోళనకు దిగిన బాధితులు

వెలుగోడు: ఓ కోతి చేసిన ఆకతాయి పనికి ఇళ్లలోని విద్యుత్‌ మీటర్లు, టీవీలు, ఫ్రీజ్‌లు కాలిపోయిన ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని ఏరాసు అయ్యపురెడ్డి నగర్‌లో  ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్‌ తీగలపై కోతి వేలాడటంతో ఆ తీగ తెగి మరో తీగలపై పడింది. దీంతో ఒక్క సారిగా హై ఒల్టేజీ రావడంతో కాలనీలోని 50 ఇళ్లలో విద్యుత్‌ మీటర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, లైట్లు కాలిపోయాయి. దీంతో బాధితులు విద్యుత్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. విద్యుత్‌ అధికారులతో చర్చించి కొత్త మీటర్లు ఇచ్చేందుకు ఒప్పించడంతో బాధితులు శాంతించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement