కర్నూల్‌ : మీ ఓటు ఉందా.. ఒకసారి సరి చూసుకోండి

KURNOOL: Have Your Vote .. See Right Away - Sakshi

 సాక్షి, కర్నూల్‌ : నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
 -1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
 www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name      పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 

- జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ప్రత్యేక సెల్‌ ఇన్‌చార్జ్‌ లక్ష్మిరాజు : 9704738448
- మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
- ప్రతి శనివారం పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుంది. పేరు ఉందో, లేదో చెక్‌ చేసుకోవచ్చు. లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
- ఎన్నికల నామినేషన్‌ దాఖలుకు చివరిరోజు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.

- నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌ఓ), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి (ఏఆర్‌ఓ) ఉంటారు. వారిని సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు.
-  తహసీల్దార్‌ ఆఫీసులో.. తహసీల్దార్‌ లేదా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులను కలిసి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు.
-  తహసీల్దార్‌ కార్యాలయంలో ఎలక్షన్‌ సెల్‌ ఫోన్‌ నంబర్లు.
    కోసిగి         : 99592 47332
    మంత్రాలయం     : 83339 88993
    కౌతాళం         : 83339 88995
    పెద్దకడబూరు    : 76748 59432

- బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ (బీఎల్‌ఓ) వద్ద ఆ బూత్‌ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీన్ని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. 
- ఒకవేళ మీ ఓటు లేదని తెలిస్తే.. పై మూడు స్థాయిల్లోనూ అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి, ఫారం–6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు.
- మీ–సేవ కేంద్రాల్లోనూ నిర్ణీత రుసుము తీసుకుని ఓటు ఉందో లేదో తెలియజేస్తారు. అలాగే, అక్కడే ఓటు నమోదు చేస్తారు.
- ఎన్నికల షెడ్యూల్‌/నోటిఫికేషన్‌ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్‌ నుంచి బూత్‌ లెవల్‌ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఈఆర్‌ఓ, తహసీల్దార్, బూత్‌ లెవల్‌ అధికారిని సంప్రదించాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top