కోనేరు హంపి వివాహం 13న | Koneru Humpy marriage on 13th august | Sakshi
Sakshi News home page

కోనేరు హంపి వివాహం 13న

Aug 2 2014 1:53 AM | Updated on Sep 2 2017 11:14 AM

కోనేరు హంపి వివాహం 13న

కోనేరు హంపి వివాహం 13న

విజయవాడలో ఈ నెల 13వ తేదీన ప్రఖ్యాత చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి వివాహం జరగనుంది. స్థానిక ‘ఏ కన్వెన్షన్ సెంటర్’ ఇందుకు వేదిక కానుంది.

సాక్షి, విజయవాడ బ్యూరో :  విజయవాడలో ఈ నెల 13వ తేదీన  ప్రఖ్యాత చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి వివాహం జరగనుంది. స్థానిక ‘ఏ కన్వెన్షన్ సెంటర్’ ఇందుకు వేదిక కానుంది. ఎఫ్ట్రానిక్స్ మేనేజింగ్ డెరైక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో హంపి వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. హంపి తండ్రి కోనేరు అశోక్ సతీసమేతంగా గురువారం హైదరాబాదులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని  ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధి కోసం రెండు లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అశోక్ అందజేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement