కోడెల మరో ఎత్తుగడ | kodela siva prasad master plan | Sakshi
Sakshi News home page

కోడెల మరో ఎత్తుగడ

Mar 10 2014 12:35 AM | Updated on Aug 24 2018 2:33 PM

నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఎవరు తమతమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం.

 నరసరావుపేటలో మళ్లీ పాదయాత్రకు సన్నాహాలు
 సత్తెనపల్లి వెళ్లేందుకు సమ్మతికానందునే...
 టిక్కెట్టుకోసం అక్కడి ఇన్‌చార్జి సైతం డిమాండ్
 అవసరమైతే ఆత్మహత్యకైనా సిద్ధమేనని హెచ్చరిక
 అగమ్యగోచరంలో పార్టీ కేడర్

 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు
 నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఎవరు తమతమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. నరసరావుపేటపైనే తొలినుంచీ ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావును సత్తెనపల్లి వెళ్లాలని అధినేత చంద్రబాబునాయుడు చెప్పడంతో ఆయన అభిమానులు ఆత్మహత్యలకు సైతం ఉపక్రమించారు. అయినా తప్పదని అధినేత మాటకు కట్టుబడి తాను సత్తెనపల్లి వెళ్లాల్సిందేనని వారికి నచ్చజెప్పారు. అయితే సత్తెనపల్లిపై ఆశలు పెట్టుకున్న అక్కడి నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ తనకు ఆ స్థానంనుంచి అవకాశం కల్పించకుంటే తానూ ఆత్మహత్యకు వెనుకాడనని ఖరాఖండీగా చెప్పడంతో కార్యకర్తల్లో అయోమ యం నెలకొంది.
 
  ఇక మంత్రి కోడెల పరిస్థితి అయితే ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే రీతిగా మారిం ది. దీంతో ఎలాగైనా నరసరావుపేటలోనే తాను పోటీ చేయాలని అంతర్గతంగా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా మళ్లీ ఈ నెల 23నుంచి త్మీయయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆ యాత్ర ద్వారా ప్రజల్లో మమేకం అయ్యేందుకు, తనకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పార్టీకి మూల స్తంభంగా నిలిచిన కోడెల పరిస్థితే ఇలా తయారైతే... మిగిలినవారి గతేమిటని కార్యకర్తలు గుసగు సలాడుకుంటున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement