'ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఒక్క తుపాకీ పేలలేదు' | Kishan Reddy Attended Jana Jagaran Meeting In Kakinada JNTU | Sakshi
Sakshi News home page

'ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఒక్క తుపాకీ పేలలేదు'

Sep 22 2019 3:11 PM | Updated on Sep 22 2019 3:13 PM

Kishan Reddy Attended Jana Jagaran Meeting In Kakinada JNTU  - Sakshi

సాక్షి, కాకినాడ : కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఆదివారం 'జన జాగారన్‌' పేరిట జాతీయ ఐక్యత ప్రచారం నిర్వహించారు. ఈ సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేశారని పేర్కొన్నారు. గత డబ్బై ఏళ్లలో కశ్మీర్‌లో ఎటువంటి రిజర్వేషన్లు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అమలు కాలేదని తెలిపారు. ఆర్టికల్‌ 370 లాంటి చట్టాలు ఇటలీ, పాకిస్తాన్‌ లాంటి దేశాల్లో ఉన్నాయా ? మన దేశంలో మాత్రం ఆర్టికల్‌ 370 ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అందుకే ఆర్టికల్‌ 370ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 65వేల టెర్రరిస్ట్‌ సంఘటనలు జరిగాయి, కానీ ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఒక్క తుపాకీ కూడా పేలలేదని పేర్కొన్నారు. కశ్మీర్‌ వ్యాలీలో వేలాది దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నేతలు ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో ఐదేళ్లు జమ్మూ కశ్మీర్‌లో స్ట్రైక్‌ జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement