కిరణ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం | Kiran kumar reddy Resignation Accepted by Governor narasimhan | Sakshi
Sakshi News home page

కిరణ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం

Feb 19 2014 1:18 PM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం - Sakshi

కిరణ్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. రాజీనామా ప్రకటన చేసిన అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన కిరణ్... గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. గవర్నర్‌ వెంటనే కిరణ్ రాజీనామాను ఆమోదించారు.

అయితే కిరణ్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్‌ కోరకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి వెంట మంత్రులు శైలజనాథ్‌, టీజీ, గంటా శ్రీనివాస్‌, కాసు, ఏరాసు, పార్థసారధి, పితాని సత్యనారాయణ, మహీధర్‌రెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  కాగా కిరణ్ రాజీనామా ఆమోదంతో ప్రస్తుత కేబినెట్ రద్దు అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement