ఇద్దరు సీఎంలకు జ్ఞానం ప్రసాదించాలని కోరుకున్నా | Khammam ysrcp MP ponguleti srinivasa reddy visit Tirumala | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంలకు జ్ఞానం ప్రసాదించాలని కోరుకున్నా

Oct 11 2014 9:27 AM | Updated on May 29 2018 4:15 PM

వైఎస్ఆర్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల : వైఎస్ఆర్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా  భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా వారికి జ్ఞానం ప్రసాదించాలని స్వామివారికి కోరినట్లు ఆయన చెప్పారు. కాగా గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా వెంకన్నను ఈరోజు ఉదయం దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement