ఖాజీపేట ఎస్‌ఐ రంగారావు సస్పెన్షన్‌ | khajipeta SI ranga rao Suspension | Sakshi
Sakshi News home page

ఖాజీపేట ఎస్‌ఐ రంగారావు సస్పెన్షన్‌

Oct 27 2017 1:47 PM | Updated on Sep 2 2018 3:51 PM

కడప అర్బన్‌ /ఖాజీపేట: ఖాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎం.రంగారావును గురువారం కడప–కర్నూలు రేంజి డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ కేసు విచారణలో తప్పుడు దర్యాప్తు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఖాజీపేట మండలం రంగాపురానికి చెందిన బండి హనుమంతుకు, వారి అన్నదమ్ములకు మధ్య ఉన్న భూమి, స్థలాల తగాదాలో తలదూర్చి అక్రమ కేసులను ఎస్‌ఐ రంగారావు బనాయించారు. ఆ మేరకు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ దగ్గరున్న సాక్ష్యాధారాలను చూపారు. దీంతో డీఐజీ స్వయంగా తమ సిబ్బందితో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గుట్కా, ఇతరత్రా అంశాలలో అవినీతికి పాల్పడినట్లు ప్రచారం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement