గంజాయి కీలక నిందితుడి అరెస్ట్ | key role in Marijuana suply a arrested | Sakshi
Sakshi News home page

గంజాయి కీలక నిందితుడి అరెస్ట్

Jan 28 2016 8:10 AM | Updated on Aug 20 2018 4:27 PM

ఇటీవల భారీగా గంజాయి పట్టుబడిన కేసుకు సంబంధించి కీలక నిందితుడు దొరికాడు. కుంచనపల్లికి చెందిన శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ: ఇటీవల భారీగా గంజాయి పట్టుబడిన కేసుకు సంబంధించి కీలక నిందితుడు దొరికాడు. కుంచనపల్లికి చెందిన శివశంకర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి ముంబయికి గంజాయి తరలింపులో శివశంకర్ రెడ్డిది కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఒడిశా స్మగ్లర్ల ద్వారా ముంబయి వ్యాపారులకు అతడు గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఇందులో విజయవాడ, హైదరాబాద్కు చెందిన ఏజెంట్ల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శివశంకర్ ను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement