సీఎం జగన్‌ వారి గుండెల్లో నిలిచిపోతారు | Karem Shivaji Praises YS Jagan Mohan Reddy At Tirumala | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ వారి గుండెల్లో నిలిచిపోతారు

Mar 2 2020 9:58 AM | Updated on Mar 2 2020 10:27 AM

Karem Shivaji Praises YS Jagan Mohan Reddy At Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకంతో సంక్రాంతిని ప్రారంభించారు. ఉగాదికి ప్రతి పేదవానికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించార’ని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ కారెం శివాజీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ అమ్మఒడి పథకంతో అమ్మ.. ఇళ్ల పట్టాల పంపిణీతో అయ్య గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. సోమవారం కారెం శివాజి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి పక్షపార్టీలన్ని కూడా అసైండ్ భూము తీసుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడా కూడా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములు తీస్కోవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ తప్పక విజయం సాధిస్తుంది. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు. మూడు రాజధానులను అడ్డుకోడానికే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి సీఎం వైఎస్‌ జగన్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరుతున్నాము. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని, భ్రమరావతిగా ఊహించుకొంటున్నారన్న సంగతి ప్రజలు గ్రహిస్తున్నార’ని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement