‘చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించి సాగనంపాలి’ | Kapu Leader Chinamilli Venkatarayudu Wants To Vote YS Jagan | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించి సాగనంపాలి’

Apr 4 2019 3:49 PM | Updated on Apr 4 2019 4:25 PM

Kapu Leader Chinamilli Venkatarayudu Wants To YS Jagan - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, పశ్చిమగోదావరి : కాపు సంక్షేమానికి వెయ్యి కోట్లు ఇస్తామని నమ్మించి.. ఏనాడు కాపుజాతిని పిలిచి దీనిపై చర్చింలేదని.. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని నిలువునా ముంచిన చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించి సాగనంపాలని జిల్లా కాపు సంఘం అధ్యక్షులు చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చాలని ఏనాడూ మేము అడగలేదని కాపులకు కల్పించాల్సిన సౌకర్యాలు మాత్రమే అడిగామని తెలిపారు. 2014 ఎన్నికల్లో 600హామీలను ఇచ్చిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు, ప్రజలు ముఖ్యంగా కాపు మహిళలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement