కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు | Kappatralla Venkatappa Naidu killing : 21 sentenced to life imprisonment | Sakshi
Sakshi News home page

కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు

Dec 10 2014 12:30 PM | Updated on Sep 2 2017 5:57 PM

కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు

కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు

కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు.

కర్నూలు: కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు.  ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి 21 మందిని దోషులుగా నిర్థారించారు. ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా... 21 మందికి జీవిత ఖైదు విధించారు.  

2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో కోడుమూరుకు బయలుదేరారు. ఆయన్ని హత్య చేయాలని పథకం పన్ని న ప్రత్యర్థులు ముందుగానే మాచాపురం వద్ద మాటు వేశారు. అటుగా వస్తున్న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు. (చదవండి: కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్)

దీంతో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి కుమారుడు ప్రత్యర్థి వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 48 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పత్తికొండ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే నిందితుల భద్రత దృష్ట్యా ఆదోని జిల్లా సెషన్స్ కోర్టుకు మార్చాలని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ హత్య కేసు ఆదోని సెషన్స్ కోర్టుకు మారింది.  దాదాపు ఆరేళ్లు విచారణ అనంతరం కోర్టు తుది తీర్పును బుధవారం వెలువరించింది. పోలీసు కేసు నమోదు చేసిన 48 మందిలో నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement