గ్యాస్‌ లీక్‌ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు

Kannababu Review Meeting On LG Polymers Gas Leakage In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్‌ ఆస్పత్రిలో సుమారు 300 మంది విష వాయువు బాధితులు చికిత్స​ పొందుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆస్పత్రుల్లో బాధితులు కోలుకుంటున్నారని ఆయన చెప్పారు. మంత్రి కన్నబాబు శనివారం ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసర గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను గ్రామాల్లోకి అనుమతించలేదని ఆయన చెప్పారు. (గ్యాస్‌ లీక్‌పై విచారణకు హైపవర్‌ కమిటీ)

అదేవిధంగా బాధత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించేందుకు ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో  కలెక్టర్‌ వినయ్‌చంద్‌, సీపీ ఆర్కే మీనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (కరువు పొమ్మంది.. వాయువు ఆయువు తీసింది)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top