వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు | YS Jagan Mohan Reddy Christmas Greetings for Telugu People | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Dec 24 2017 1:11 PM | Updated on Jul 25 2018 4:58 PM

YS Jagan Mohan Reddy Christmas Greetings for Telugu People  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం ఇవన్నీ జీసస్‌ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని జగన్‌ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement