పాఠశాలా?.. చెరసాలా? | Is this is shcool or jail ? | Sakshi
Sakshi News home page

పాఠశాలా?.. చెరసాలా?

Oct 23 2016 1:55 AM | Updated on Sep 4 2017 6:00 PM

పాఠశాలా?.. చెరసాలా?

పాఠశాలా?.. చెరసాలా?

ప్రభుత్వం నిర్బంధ విద్యా హక్కుచట్టం సక్రమంగా అమలు చేస్తుందో లేదో కానీ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను గదిలో

ప్రకాశం : ప్రభుత్వం నిర్బంధ విద్యా హక్కుచట్టం సక్రమంగా అమలు చేస్తుందో లేదో కానీ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను గదిలో నిత్యం ఇలాగే నిర్బంధిస్తున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో అటవీ ప్రాంత సమీపంలోని మారుమూల గ్రామం బొమ్మిలింగం. ఈ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా శనివారం ముగ్గురు విధులకు హాజరయ్యారు.

వీరంతా మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టాఫ్ రూంలో ముచ్చట్లు చెప్పుకుంటూ పిల్లలను ఇలా గదిలో పెట్టి తాళం వేశారు. పిల్లలు బయటకు వచ్చి గొడవ చేయకుండా రోజూ ఇలాగే తాళం వేస్తుంటారని స్థానికులు తెలిపారు. దీనిపై ఉపాధ్యాయులను ప్రశ్నించగా ఎవరూ స్పందించలేదు.    -అర్ధవీడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement