శాస్త్రీయ సంగీతానికే ఉజ్వల భవిత | Interview With Music Director Koti | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ సంగీతానికే ఉజ్వల భవిత

Feb 15 2015 12:25 AM | Updated on Sep 2 2017 9:19 PM

శాస్త్రీయ సంగీతానికే ఉజ్వల భవిత

శాస్త్రీయ సంగీతానికే ఉజ్వల భవిత

శాస్త్రీయ సంగీతానికే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అన్నారు.

శాస్త్రీయ సంగీతానికే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అన్నారు. రత్నగిరిపై సత్యదేవుని శనివారం దర్శించిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. : అన్నవరం (తొండంగి)
 

 సాక్షి : ఇప్పటివరకూ ఎన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు?
 కోటి : 450 చిత్రాలకు పైగా.
 
 సాక్షి : ప్రత్యేకంగా గుర్తింపు పొందిన పాటలు ఎన్ని?
 కోటి : 2,500 వరకూ ఉన్నాయి.
 
 సాక్షి : ఏయే భాషా చిత్రాలకు సంగీతం అందించారు?
 కోటి : తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలకు సంగీతం అందించాను.
 
 సాక్షి : సంగీతంలో పాశ్చాత్య ఒరవడి ఎక్కువగా ఉండటానికి కారణం?
 కోటి : ఈ కాలం కుర్రకారు ప్రసార మాధ్యమాల ప్రభావంతో పాశ్చాత్య సంగీతంపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
 
 సాక్షి : రానున్న కాలంలో శాస్త్రీయ సంగీతం ప్రభావం ఎలా ఉంటుంది?
 కోటి : శాస్త్రీయ సంగీతానికి రానున్న కాలంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సంగీత ప్రపంచానికి మూలమే శాస్త్రీయ సంగీతం. కాబట్టి కర్నాటక, హిందుస్థానీ సంగీతం నేర్చుకున్న అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. పాశ్చాత్య సంగీత ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంటుందని అభిప్రాయపడుతున్నా. ప్రస్తుతం యువత మళ్లీ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి పెంచుకుంటోంది.
 
 సాక్షి : ప్రస్తుతం ఏవైనా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారా?
 కోటి : లేదు. జెమినీలో వస్తున్న ‘బోల్ బేబీ బోల్’ కార్యక్రమం ఒక్కటే చేస్తున్నాను.
 
 సాక్షి : ఎటువంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తారు?
 కోటి : అరుంధతి చిత్రంలాంటి భారీ బడ్జెట్ చిత్రం కావాలి. అలాగే కథనుబట్టి కూడా నిర్ణయం తీసుకుంటాను.
 

Advertisement
 
Advertisement
Advertisement