భూ క్రయవిక్రయాలపై నిఘా | Intelligence on the land purchase and the sale | Sakshi
Sakshi News home page

భూ క్రయవిక్రయాలపై నిఘా

Jan 9 2014 2:37 AM | Updated on Sep 2 2017 2:24 AM

సిద్దిపేట ఆదాయ పన్ను శాఖ పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, వర్గల్, ములుగు ప్రాంతాల్లో వ్యవసాయేతర భూమి క్రయవిక్రయాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: సిద్దిపేట ఆదాయ పన్ను శాఖ పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, వర్గల్, ములుగు ప్రాంతాల్లో వ్యవసాయేతర భూమి క్రయవిక్రయాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా, నిబంధనల మేరకు ప్రభుత్వానికి పన్నులను రియల్టర్లు చెల్లించడం లేదన్న సమాచారంతో అధికార యంత్రాంగం బడా రియల్టర్‌ల జాబితాను తయారు చేసుకుంటున్నట్లు సమాచారం.
 
 వీరికి ఇప్పటివరకు చేసిన భూ క్రయవిక్రయాల విలువలను నమోదు చేసి ఐటీ రిటర్న్‌లలో చూపుతున్నారా..? లేదా అనే విషయాన్ని సమీక్షిస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వీటి వివరాలను తెప్పించుకునే అధికారులు, ఆన్‌లైన్ ప్రవేశపెట్టడంతో నేరుగా వివరాలను పరిశీలించగలుగుతున్నారు. వీటి ఆధారంగా పన్ను ఎగ్గొట్టే వారిపై చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో పేరుకుపోయిన పెండింగ్ రిటర్న్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పెరుగుతున్న వ్యాపారాలకు, ఆదాయాలకు అనుగుణంగా పన్నులు, చెల్లింపుదారుల సంఖ్య పెరగడం లేదని ఐటీ భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement