ప్రగతి వైపు అడుగులు

Independence Day Celebrations In Srikakulam District - Sakshi

‘స్పందన’తో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌  

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. జిల్లా కేంద్రం లోని పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం 73వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించా రు. ‘స్పందన’ ద్వారా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. ఇ ప్పటివరకు 13,201 అర్జీల్లో 11,062 అర్జీ లు పరిష్కరించారని తెలిపారు. ఇటీవల వచ్చిన వంశధార, నాగావళి వరదల్లో ప్రకృతి విపత్తును కూడా సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలకు పారదర్శకంగా అందించడానికి వలంటీర్ల వ్యవస్థకు రూపకల్ప న చేశామని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని, ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.40 హెక్టార్లలో పంట వేయడానికి ప్రణాళిక వేసినట్లు వివరించారు. జలాశయాల అభివృద్ధికి ని ర్ణయాలతో పాటు రైతులకు విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపా రు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

అక్టోబర్‌ నుంచి రైతు భరోసా..
అక్టోబర్‌ నుంచి రైతు భరోసా మొదలవుతుందని, ఈ పథకం ద్వారా రైతుకు రూ.12, 500 అందుతుందని తెలిపారు. రానున్న నాలు గేళ్లలో దాదాపు 3,29,000 రైతు కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే ఇరవై వేల మంది కౌలు రైతులకు కూడా భరోసా కల్పించినట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో రూ.2,171 కోట్ల పంట రుణాలు, రూ. 1030 కోట్ల టెర్మ్‌ రుణాలు అం దించడానికి లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. ఉద్యాన పంటల అభివృద్ధి, బిందు, తుంపర సేద్యాలపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. పాడి రైతులకు దాణా అందించేందుకు 2612 ఎకరాల్లో మేలురకం పశుగ్రాసం పెంచుతున్నామని తెలిపారు. జల వనరుల అభివృద్ధి కింద వంశధార, మహేంద్ర తనయ పనుల కోసం రూ.1536 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు 2020కి పూర్తవుతుందని చెప్పారు. తాగునీటి కోసం ఇప్పటి వరకు రూ.305.51 కోట్లు ఖర్చు చేశామన్నారు. వంశధార ఎడమకాలువకు రూ.543 కోట్లు, నారాయణపురం ఆనకట్టకు జైకా నిధులు రూ.112 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఆరోగ్య శ్రీకి ప్రాధాన్యత..
ఆరోగ్య శ్రీ సేవలకు ప్రాధాన్యమిస్తున్నామని, మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రుల పునరుద్ధరణకు రూ.4.70 కోట్లు కేటాయించామని, రూ.2.27 కోట్లతో కొత్త భవనాలు కడుతున్నామని చెప్పారు. రిమ్స్‌ వార్డులను సీఆర్‌ఎస్‌ కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు.వెయ్యి రూపాయల ఖర్చు దాటిన వైద్యాన్ని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ కార్యక్రమం ద్వారా చేస్తామన్నారు. విద్యపై కూడా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 161 డిజటల్‌ క్లాస్‌లు, 284 పాఠశాలల్లో వెర్టికల్‌ తరగతులు మం జూరు చేసినట్లు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీ తరగతుల నిర్వహణ, మెరుగైన వసతి కోసం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జగనన్న అమ్మ ఒడి అమలులోకి వస్తుందన్నారు.

తాగునీటికి ప్రత్యేక ప్రణాళిక..
తాగునీటి వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, కిడ్నీ ప్రభావిత ప్రాంతా ల్లో ఏడు ఆర్వో ప్లాంటులు, గిరిజన ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్సార్‌ ఆసరా ద్వారా ఆదుకుంటున్నామని వివరించారు. నవరత్నాల్లోని ఓ భాగమైన ఈ పథకం ద్వారా 2019 ఏప్రిల్‌ 11 నాటికి చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని మహిళా సంఘాలకు నాలుగు విడతల్లో చెల్లిస్తామని, అందుకు రూ.1385.61 కోట్లు 48,171 సంఘాలకు అందజేయనున్నామని అన్నారు. నాంది కార్యక్రమం ద్వారా న్యూట్రిన్‌ బిస్కెట్లు, నువ్వుల ఉండలు వంటి వాటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఇళ్ల పట్టాల పంపిణీ..
జిల్లాలోని నిరుపేదలైన లక్ష కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఉగాది నాటికి కార్యక్రమం జరుగుతుందని దాసన్న అన్నారు. తిత్లీలో నిరాశ్రయులైన 10,767 కుటుంబాలకు వైఎ స్సార్‌ గృహనిర్మాణ పథకం ద్వారా 269.18 కోట్లతో ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఉపాధి లోనూ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు గాను 114 ఎంఎస్‌ఎంఈలు రూ. 49 కోట్లతో స్థాపించి, 1160 మందికి ఉపాధి కల్పించామని అన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామని, కిడ్నీ బాధితులకు పింఛన్‌ మొత్తం పెంచామని గుర్తు చేశారు. దశల వారీ గా పింఛను మొత్తం పెంచుకుంటూ పోతామని, 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛను అందిం చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపా రు. భవనాలు, రహదారుల అభివృద్ధికి రూ. 860 కోట్లు కేటాయించామని తెలిపారు. పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. పంచా యతీ రాజ్‌ విబాగం ద్వారా రూ.56.65 కోట్లతో 19 రహదారులకు టెండర్లు పిలిచామని తెలిపా రు. 436 అంగన్‌వాడీ భవనాలు ఎన్‌ఆర్‌ఈజీ ఎస్‌ నిధులలో నిర్మిస్తున్నామన్నారు. రైతులకు పగటి పూట నాణ్యంగా 9 గంటల పాటు విద్యు త్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

టూరిజంలో వేగం..
ప్రగతి కార్యక్రమాలతోపాటు టూరిజంను కూ డా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అన్నారు. టెంపుల్‌ టూరిజం, కళింగపట్నం, శివసాగర్‌ బీచ్, జగతిపల్లి రిసార్ట్సు, గిరిజన మ్యూజియం, దేవాలయాలు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనట్లు చెప్పారు. అలాగే జిల్లాలో 1.20 కోట్ల మొక్కలు నాటుతున్నామని, హరిత వాతావరణం తీసుకువస్తామని చెప్పారు. క్రీడలకు ప్రాధాన్యత, జాబ్‌మేళాల నిర్వహణలోనూ ముందంజలో ఉన్నామని సోదాహరణంగా వివరించారు. ప్రజల సంతృప్త స్థాయిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  అంతకుముందు ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ దళాల గౌరవ వంద నం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఆయనతో పాటుగా కలెక్టర్‌ జె.నివాస్,  ఏఎస్పీ అమ్మిరెడ్డి, ఐటీడీఏ పీవో సీ ఎం సాయికాంత్‌ వర్మ, ట్రైనీ కలెక్టర్‌ భరత్‌తేజ, జేసీ పి.రజనీకాంతారావు, డీఆర్‌ఓ కె.నరేంద్ర ప్రసాద్, ఆర్డీఓ ఎంవీ రమణ, వైఎస్సార్‌సీపీ ఎంపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, ధర్మాన పద్మప్రియ, డ్వామా పీడీ హెచ్‌ కూర్మారావు, డీఆర్‌డీఏ పీడీ ఎ.కళ్యాణ చర్రవర్తి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

క్రికెటర్‌ వెంకటేశ్వరరావుకు గౌరవం..
వజ్రపుకొత్తూరు: ఉద్దానం రామకృష్ణాపురానికి చెందిన అంధ క్రికెటర్‌ దున్న వెంకటేశ్వరరావుకు ప్రతిభకు తగ్గ గౌరవం దక్కింది. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాంతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెంకటేశ్వరరావును అవార్డుతో అభినందించారు. రెండేళ్లుగా భారత జట్టు విజయాల్లో వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. 
కలెక్టర్‌ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర జిల్లా అధికారులు క్రికెటర్‌ వెంకటేశ్వరరావును అభినందించారు. దీనిపై ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు చింత జనార్ధనరావు, చింత హేమారావు, దున్న కృష్ణారావు తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top