నర్సీపట్నం, పాయకరావుపేటల్లో ఐటీ దాడులు

Income Tax Raids in Narsipatnam Payaka Rao Peta - Sakshi

విశాఖపట్నం, నర్సీపట్నం, పాయకరావుపేట:  నర్సీపట్నం, పాయకరావుపేటల్లో సోమవారం ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నర్సీపట్నంలోని  సౌత్‌సెంట్రల్‌ షాపింగ్‌మాల్, జ్యూయలర్స్‌పై  దాడులు  జరిపారు. రూరల్‌ జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సీపట్నంలో ఇటీవల వస్త్ర, బంగారు షాపులు అధిక సంఖ్యలో వెలిశాయి. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన సౌత్‌సెంట్రల్‌  షాపింగ్‌మాల్, నాయుడు, శాంతిసాయి జ్యూలయర్స్‌పై ఆదాయ పన్నుశాఖ అధికారులు  ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సెంట్రల్‌మాల్‌ను మూసివేసి లోపల అధికారులు తనిఖీలు జరిపారు.  పాయకరావుపేట  పట్టణంలో ఉన్న సౌత్‌ సెంట్రల్‌ షాపింగ్‌మాల్‌లో కూడా ఆదాయ పన్ను శాఖ అ«ధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం రెండుగంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగాయి. యాజమాన్యం సమక్షంలోనే అధికారులు షాపింగ్‌మాల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపింగ్‌మాల్‌ తలుపులు మూసి వేశారు.ఈ మాల్‌లో వస్త్రవ్యాపారంతో పాటు,  బంగారం వ్యాపారం కూడా జరుగుతోంది. ఐటీ అధికారుల దాడులతో ఈ రెండు పట్టణాల వ్యాపారుల్లో కలవరం మొదలైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top