పన్నులు కట్టండి.. కర్తవ్యాన్ని పాటించండి

Income Tax Day 4K Run In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: 159వ ఇన్‌కం టాక్స్ డేను పురస్కరించుకుని నగరంలో ఆదివారం ‘వాక్ ఫర్ ఐకర్ భారత్’ పేరుతో ఆదాయం పన్ను  కార్యాలయం వద్ద నుంచి 4కే రన్ నిర్వహించారు. ఈ 4కే రన్‌ను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించి.. రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్‌కంటాక్స్ వాకథాన్‌ను దేశవ్యాప్తంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. ప్రజలు తమకు విధించిన ట్యాక్స్‌లను  సకాలంలో చెల్లించాలని, పన్నులు సక్రమంగా చెల్లిస్తేనే.. వ్యవస్థలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చునని చెప్పారు. టాక్స్‌లు చెల్లించడం ద్వారా పౌరుల మధ్య వ్యత్యాసాలు తగ్గుతాయన్నారు. ప్రజలంతా తమ పరిధిలోని పన్నులు చెల్లించి.. తమ కర్తవ్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top