సాక్షి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ముస్లిం సోదరులకు వైఎస్ జగన్.. ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షలు విరమింపచేశారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొన్నారు.


