రేషన్ దుకాణంలో అక్రమ నిల్వలు.. | Improper storage in ration shop | Sakshi
Sakshi News home page

రేషన్ దుకాణంలో అక్రమ నిల్వలు..

Feb 6 2015 9:06 PM | Updated on Sep 2 2017 8:54 PM

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం ఎస్సీ కాలనీలోని చౌక ధరల దుకాణంలో అక్రమంగా నిల్వ చేసిన బియ్యం ఉన్నాయంటూ గ్రామస్తులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం ఎస్సీ కాలనీలోని చౌక ధరల దుకాణంలో అక్రమంగా నిల్వ చేసిన బియ్యం ఉన్నాయంటూ గ్రామస్తులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎస్పీ శుక్రవారం ఆ దుకాణం వద్దకు సీఐ, ఎస్సైలను పంపించారు. మధ్యాహ్నం అక్కడికి పోలీసులు చేరుకున్నప్పటికీ సాయంత్రం వరకు దుకాణాన్ని డీలర్ తెరవలేదు.

దీంతో పోలీసులు.. సాయంత్రం వరకు ఆయన కోసం అక్కడే వేచి ఉన్నారు. కొద్దిసేపు వేచి ఉన్న సీఐ, డిప్యూటీ తహశీల్దారు.. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్సై మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. కాగా, దుకాణంలో ఏ మేరకు బియ్యం నిల్వలు ఉన్నాయో తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement