రాష్ట్రంలో మహిళలపై వరకట్న వేధింపులు ఎక్కువైయ్యాయి. వరకట్నాన్ని ప్రభుత్వం నిషేధించిన కూడా వరకట్న హత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై వరకట్న వేధింపులు ఎక్కువైయ్యాయి. వరకట్నాన్ని ప్రభుత్వం నిషేధించిన కూడా వరకట్న హత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో ఓ మహిళ వరకట్న వేధింపులకు బలైంది. ఆమెను అదనపు కట్నం పుట్టింకివెళ్లి తీసుకరమ్మని భర్త వేధించేవాడు. ప్రతిరోజూ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. అదనపు కట్నం తీసుకరాలేదనే నేపంతో భార్యను ఉరివేసి భర్త చంపాడు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు.