నాపరాళ్ల ఫ్యాక్టరీలో ఘోరం | Husband killed wife | Sakshi
Sakshi News home page

నాపరాళ్ల ఫ్యాక్టరీలో ఘోరం

Dec 15 2015 3:11 PM | Updated on Sep 3 2017 2:03 PM

కట్టుకున్న భర్తే.. ఓ ఇల్లాలి పాలిట కాల యముడిగా మారాడు. కత్తితో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.

కట్టుకున్న భర్తే.. ఓ ఇల్లాలి పాలిట కాల యముడిగా మారాడు. కత్తితో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలోని నాపరాళ్ల ఫ్యాక్టరీలో ఈ ఘోరం జరిగింది. దేవకుమారి (37), ఏసన్నలు భార్యా భర్తులు. వీరు నాపరాళ్ల ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తూ అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఏసన్న తన భార్య దేవకుమారిని కత్తితో నరికి బయట గొళ్లెం పెట్టి పరారయ్యాడు. లోపల రక్తపు మడుగులో దేవకుమారి మృతి చెంది ఉండగా మంగళవారం మధ్యాహ్నం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement