భార్యపై కత్తితో దాడి చేసిన భర్త | Husband attacks wife with Knife | Sakshi
Sakshi News home page

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

Jul 30 2015 5:04 PM | Updated on Jul 27 2018 2:18 PM

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త రాక్షసుడిలా మారి ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన విజయవాడ లబ్బిపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది.

విజయవాడ : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త రాక్షసుడిలా మారి ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన విజయవాడ లబ్బిపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ లబ్బిపేటకు చెందిన నాగరాజు(30) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా భార్య రాజకుమారి(24)పై నాగరాజు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతంగా మారి గురువారం భార్యపై కత్తితో దాడికి దిగాడు. కత్తిపోట్లకు ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement