మద్యం కోసం ఏం చేశాడంటే ! | Husband attacked his wife with knife for money | Sakshi
Sakshi News home page

మద్యం కోసం ఏం చేశాడంటే !

Jun 28 2017 5:01 PM | Updated on Sep 5 2017 2:42 PM

మద్యం కోసం ఏం చేశాడంటే !

మద్యం కోసం ఏం చేశాడంటే !

జీవితాంతం సుఖసంతోషాలలో, కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట శత్రువుగా మారాడు.

– మద్యానికి డబ్బు ఇవ్వలేదని భార్యపై కత్తితో దాడి

ధర్మవరం: జీవితాంతం సుఖసంతోషాలలో, కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట శత్రువుగా మారాడు. తాగుడు బానిసైన భర్త భార్యను మద్యం కోసం డబ్బులివ్వలేదని కత్తితో గొంతు కోసిన సంఘటన పట్టణంలో సంచలనం రేపింది.  కొత్తపేటలో గీతా మందిర సమీపంలో నివసిస్తున్న చేనేత కార్మికుడు నాగభూషణం మద్యానికి బాసిసయ్యాడు. భార్య నాగేంద్రమ్మను మద్యానికి డబ్బులివ్వాలని ప్రతిరోజూ గొడవపడేవాడు. మంగళవారం సాయంత్రం మరోసారి డబ్బు కోసం భార్యతో భర్త గొడవకు దిగాడు.

ఈ క్రమంలో కుమారుడు కృష్ణ తండ్రిని వారించాడు. దీంతో నన్నే అడ్డుకుంటావా అంటూ తండ్రి నాగభూషణం కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో వంట పనిలో నిమగ్నమై ఉన్న భార్య నాగేంద్రమ్మను కత్తితో దాడిచేసి ఆమె గొంతును కోసేశాడు. ఇది గమనించిన కుమారుడు కృష్ణ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అతనికి ఎడమ చేతివేళ్లు తెగాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు కత్తితో ఉన్న నాగభూషణంను అడ్డుకున్నారు.

వెంటనే కుమారుడు ద్విచక్ర వాహనంలో తన తల్లి నాగేంద్రమను ఎక్కించుకుని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. నాగేంద్రమ్మ గొంతుకు 14 కుట్లు పడ్డాయి. నాగేంద్రమ్మ మాట్లాడలేకపోవడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement