కరోనా బాధితురాలిపై అమానుషం

​House Owner Inhuman Behaviour On Corona Negative Patients In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి క్లిష్ట​ సమయంలో కొంతమంది కరోనా బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తాజగా తిరుపతిలో కరోనా వైరస్‌ బాధితురాల పట్ల ఓ ఇంటి యజమాని అమానుషంగా వ్యహరించారు. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని వచ్చిన చంద్రకళ అనే మహిళను తమ ఇంట్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రకళ తన ఇద్దరు కుమార్తెలతో నడిరోడ్డు మీద ఇంటి యజమాని అనుమతి కోసం పడిగాపులు కాశారు. 

చంద్రకళ కొన్నేళ్ల నుంచి తన భర్త, ఇద్దరు పిల్లలతో సుందరయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల చంద్రకళకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెతోపాటు కుటంబం మొత్తం క్వారంటైన్‌కు వెళ్లారు. 14 రోజులపాటు క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న తర్వాత వారికి నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చిన వారి పట్ల ఇంటి యజమాని వ్యవహరించిన తీరుతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.

 


 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top