అసలే తక్కువ.. ఆపై ఆలస్యం | Hostels, tutor distress | Sakshi
Sakshi News home page

అసలే తక్కువ.. ఆపై ఆలస్యం

Dec 23 2015 12:43 AM | Updated on Sep 3 2017 2:24 PM

అసలే తక్కువ.. ఆపై ఆలస్యం

అసలే తక్కువ.. ఆపై ఆలస్యం

ప్రభుత్వ వసతి గృహాల్లో ట్యూటర్లుగా పని చేస్తున్న నిరుద్యోగులు వేతనాలు అందక పస్తులుండాల్సి వస్తోంది.

వసతి గృహాల్లో ట్యూటర్ల దుస్థితి
నాలుగు నెలల నుంచి అందని వేతనాలు
పెరిగిన నిత్యావసరాలతో అవస్థలు
పట్టించుకోని అధికారులు

 
ప్రభుత్వ వసతి గృహాల్లో  ట్యూటర్లుగా పని చేస్తున్న నిరుద్యోగులు వేతనాలు అందక పస్తులుండాల్సి వస్తోంది. డీఎస్సీ పరీక్షలు రాసి పోస్టులు రాక ట్యూటర్లుగా మారిన వీరు చాలీచాలని వేతనాలకే విధులు నిర్వహిస్తున్నారు.  అవి కూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో కీలక పాత్ర పోషించే వీరికి నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
 
పెదకూరపాడు కృష్ణాజిల్లాలో 40 ప్రత్యేక ఎస్సీ వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో సబ్జెక్టుల వారీగా పాఠాలు బోధించే ట్యూటర్లు 160 మంది పనిచేస్తున్నారు. అలాగే 50 ప్రత్యేక బీసీ వసతిగృహాల్లో 176 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 45 ఎస్సీ ప్రత్యేక వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో 185 మంది ట్యూటర్లు పని చేస్తున్నారు. వీరందరికీ సబ్జెట్‌కు రూ.1500 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ గుంటూరు జిల్లాలో పని చేసే ట్యూటర్లకు ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల వేతనాలు ఇంత వరకు చెల్లించలేదు. పలు గృహాల్లో వేతనాలు మంజూరైనా ట్యూటర్లకు అందని పరిస్థితి నెలకొంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఒక వైపు, అందని వేతనాలు మరోవైపు ట్యూటర్లను ఆవేదనకు గురి చేస్తున్నారుు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ట్యూటర్ల పాత్ర కీలకమైంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆంగ్లం, లెక్కలు, హిందీ, సైస్స్ బోధిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇటువంటి ట్యూటర్లకు వేతనాలు చెల్లించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
 
 వేతనాలు వెంటనే ఇవ్వాలి

 పండుగ రోజుల్లో వేతనాలు లేక పస్తులుంటున్నాం. నిరుద్యోగుల గోడు పట్టించుకునే నాథుడే లేరు. నాలుగు నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయి. వెంటనే చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చూడాలి.
 -కంచర్ల కృష్ణ,
 ట్యూటర్, పెదకూరపాడు
 
 కష్టానికి తగ్గ ఫలితంలేదు

 వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులు ఆంగ్లం, గణితం సబ్జెక్టులు బోధిస్తున్నాం. విద్యార్థుల ఉత్తీర్ణతలో కీలకపాత్ర పోషిస్తున్నాం. అరుునా మా కష్టానికి తగ్గ ఫలితం ఉండటంలేదు. అరకొర వేతనాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నారు.
 -షేక్ హఫీజ్, ట్యూటర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement