breaking news
Public housing
-
అసలే తక్కువ.. ఆపై ఆలస్యం
వసతి గృహాల్లో ట్యూటర్ల దుస్థితి నాలుగు నెలల నుంచి అందని వేతనాలు పెరిగిన నిత్యావసరాలతో అవస్థలు పట్టించుకోని అధికారులు ప్రభుత్వ వసతి గృహాల్లో ట్యూటర్లుగా పని చేస్తున్న నిరుద్యోగులు వేతనాలు అందక పస్తులుండాల్సి వస్తోంది. డీఎస్సీ పరీక్షలు రాసి పోస్టులు రాక ట్యూటర్లుగా మారిన వీరు చాలీచాలని వేతనాలకే విధులు నిర్వహిస్తున్నారు. అవి కూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో కీలక పాత్ర పోషించే వీరికి నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు. పెదకూరపాడు కృష్ణాజిల్లాలో 40 ప్రత్యేక ఎస్సీ వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో సబ్జెక్టుల వారీగా పాఠాలు బోధించే ట్యూటర్లు 160 మంది పనిచేస్తున్నారు. అలాగే 50 ప్రత్యేక బీసీ వసతిగృహాల్లో 176 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 45 ఎస్సీ ప్రత్యేక వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో 185 మంది ట్యూటర్లు పని చేస్తున్నారు. వీరందరికీ సబ్జెట్కు రూ.1500 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ గుంటూరు జిల్లాలో పని చేసే ట్యూటర్లకు ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల వేతనాలు ఇంత వరకు చెల్లించలేదు. పలు గృహాల్లో వేతనాలు మంజూరైనా ట్యూటర్లకు అందని పరిస్థితి నెలకొంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఒక వైపు, అందని వేతనాలు మరోవైపు ట్యూటర్లను ఆవేదనకు గురి చేస్తున్నారుు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ట్యూటర్ల పాత్ర కీలకమైంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆంగ్లం, లెక్కలు, హిందీ, సైస్స్ బోధిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇటువంటి ట్యూటర్లకు వేతనాలు చెల్లించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారుు. వేతనాలు వెంటనే ఇవ్వాలి పండుగ రోజుల్లో వేతనాలు లేక పస్తులుంటున్నాం. నిరుద్యోగుల గోడు పట్టించుకునే నాథుడే లేరు. నాలుగు నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయి. వెంటనే చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చూడాలి. -కంచర్ల కృష్ణ, ట్యూటర్, పెదకూరపాడు కష్టానికి తగ్గ ఫలితంలేదు వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులు ఆంగ్లం, గణితం సబ్జెక్టులు బోధిస్తున్నాం. విద్యార్థుల ఉత్తీర్ణతలో కీలకపాత్ర పోషిస్తున్నాం. అరుునా మా కష్టానికి తగ్గ ఫలితం ఉండటంలేదు. అరకొర వేతనాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నారు. -షేక్ హఫీజ్, ట్యూటర్ -
ప్రతిభలో గుడ్డు మాయం..!
కుళ్లిన అరటిపండ్లే పోషకాహారం చాలీచాలని కూరలతో భోజనం భద్రాచలం : ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరకు సరైన పౌష్టికాహారం కూడా అందటం లేదు. విలీన మండలాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భద్రాచలం సమీపంలోని ప్రతిభ పాఠశాలను మంగళవారం ‘సాక్షి’ పరిశీలించగా, ఇది తేటతెల్లమైంది. 6 నుంచి ఇంటర్ వరకూ ఉన్న ఇక్కడ 420 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు అనుబంధంగానే వసతి గృహం కూడా ఉంది. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టలేదు. పప్పు, వంకాయ కూర వండినప్పటకీ అవి సరిపోలేదు. పలువురు విద్యార్థులు భోజనం చేయకుండానే కూరలు అయిపోయాయి. చివరకు ఉపాధ్యాయల కోసం దాచిన వంకాయ కూరను అప్పటికప్పుడు తీసుకొచ్చి వడ్డించా రు. చాలా మందికి పప్పు కూడా సరిపోలేదు. పప్పు కావాలని అడిగిన వారిపై వడ్డించే సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక పిల్లలు మంచినీరు తాగడానికి గ్లాసులు కూడా లేకపోవటంతో భోజనం చేసిన ప్లేట్లే శుభ్రం చేసుకుని వాటితోనే నీటి కోసం పరుగులు తీయడం కనిపించింది. పెరుగులో కలుపుకునే ఉప్పును అక్కడున్న ఓ కుర్చీలో పోయగా, దుమ్ము దూళి పడుతున్నప్పటకీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కుళ్లిన అరటిపండ్లు పంపిణీ... గుడ్లు అయిపోయినందునే ఇవ్వలేకపోయామని పాఠశాల డిప్యూటీ వార్డెన్ సలీంఖాన్ తెలిపారు. కాగా, విద్యార్థులకు కుళ్లిన అరిటపండ్లనే పెట్టారు. పిల్లలు భోజనం చేసే డార్మిటరీ హాల్లో ఒక ట్రేలో అరిటిపండ్లును కుప్పగా వేశారు. అయితే అవన్నీ కుళ్లి నీళ్లు కారుతున్నాయి. అయినా వాటినే విద్యార్థులు తినాల్సి వచ్చింది. ఇవి తింటే రోగాలు వస్తాయని తెలిసీ కూడా పాఠశాల నిర్వాహకులు ఇలా వ్యవహరించటం విమర్శలకు తావిస్తోంది. అడిగేవారు లేరని... ఆంధ్రలో విలీనమైన ప్రాంతంలో ఈ పాఠశాల ఉండటంతో భద్రాచలం ఐటీడీఏ అధికారులు పర్యవేక్షించడం లేదు. ఆంధ్ర అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో విలీన మండలాల్లో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోత పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల వారు కోరుతున్నారు.