రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1.. | Heavy Temperature in Telangana | Sakshi
Sakshi News home page

రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1..

May 20 2015 4:06 PM | Updated on Sep 3 2017 2:23 AM

రాజధానిలో 45 ..  నిజామాబాద్‌లో 46.1..

రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1..

తెలంగాణ రాష్ట్రంలో మే నెల ఎండలు జనంపై ప్రతాపం చూపిస్తున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే నెల ఎండలు జనంపై ప్రతాపం చూపిస్తున్నాయి. ఎండ తీవ్రతకు వడగాల్పులు తోడవటంతో జనం విలవిల్లాడుతున్నారు. మంగళవారం అత్యధికంగా నిజామాబాద్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ రికార్డు బుధవారం తుడిచిపెట్టుకుపోయింది. నిజామాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాజధాని హైదరాబాద్‌లో కూడా 45 డిగ్రీలకు చేరుకుంది. ఇంకా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement