అలర్ట్‌: కోస్తాకు వాయుగుండం ముప్పు | Heavy rain, high winds forecast over North Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అలర్ట్‌: కోస్తాకు వాయుగుండం ముప్పు

Nov 15 2017 4:33 PM | Updated on Nov 15 2017 4:41 PM

Heavy rain, high winds forecast over North Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో కోస్తాకు వాయుగుండం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు అల్పపీడనం పయనిస్తోందని.. అల్పపీడనం మరింత బలపడినట్టు వాతావరణం కేంద్రం తెలిపింది. అది వాయుగుండంగా మారి మచిలీపట్నానికి 230 కి.మీ.. విశాఖకు దక్షిణంగా 300 కి.మీ, గోపాల్‌ పూర్‌కు 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు అధికారులు తెలిపారు.

రానున్న 24 గంటల్లో వాయుగుండం ఈశాన్య దిశగా పయనించనుంది. దీంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement