అష్టదిగ్బంధంలో విజయవాడ | heavy police security in Vijayawada | Sakshi
Sakshi News home page

అష్టదిగ్బంధంలో విజయవాడ

Jun 8 2014 11:02 AM | Updated on Sep 17 2018 6:18 PM

అష్టదిగ్బంధంలో విజయవాడ - Sakshi

అష్టదిగ్బంధంలో విజయవాడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇ.ఎల్.ఎన్.నరసింహన్, ఐదుగురు ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ, పార్టీ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్, 15 మంది కేంద్ర మంత్రులు వస్తారని అంచనా. వీరంతా గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఏఎన్‌యూ ఎదురుగా ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుంటారు.

ఈ క్రమంలో విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ఎక్కడ చూసినా పోలీసులే కన్పిస్తుండడంతో ఖాకీవనంగా కన్పిస్తోంది. ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 100 హోటళ్ల వరకు ఉండగా వాటిని ఇటు అధికారులు, అటు తెలుగుదేశం నాయకులు బుకింగ్ చేశారు. దీంతో హోటళ్ల వద్ద కూడా భద్రత ఏర్పాటు చేశారు. నగరానికి వీఐపీలు, అధికారుల తాకిడి ఎక్కువ కావడంతో దుర్గగుడిలోనూ భక్తుల రద్దీ పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement