కొండంత నష్టం - చీమంత సాయం:వైఎస్ఆర్సీపీ | Heavy loss-Very little aid: YSRCP | Sakshi
Sakshi News home page

కొండంత నష్టం చీమంత సాయం:వైఎస్ఆర్సీపీ

Dec 20 2014 4:36 PM | Updated on May 29 2018 4:18 PM

కొండంత నష్టం - చీమంత సాయం:వైఎస్ఆర్సీపీ - Sakshi

కొండంత నష్టం - చీమంత సాయం:వైఎస్ఆర్సీపీ

హుద్హుద్ తుపాను కారణంగా కొండంత నష్టం జరిగితే చీమంత సాయం చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు.

హైదరాబాద్: హుద్హుద్ తుపాను కారణంగా కొండంత నష్టం జరిగితే చీమంత సాయం చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్రకు చెందిన  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు గిద్ది ఈశ్వరి, కళావతి, శ్రీవాణి, సర్వేశ్వరరావు, రాజన్న దొరలు ఈ రోజు శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హుద్హుద్ తుపానులో నష్టపోయిన గిరిజన ప్రాంతాల రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

తుపాను వల్ల చనిపోయిన గిరిజన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలేదని చెప్పారు. తుపాను వల్ల 21వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ సహాయక చర్యలకు మాత్రం 244 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement