ప్రజా విజయం | he public success of the ysrcp | Sakshi
Sakshi News home page

ప్రజా విజయం

May 13 2014 2:56 AM | Updated on Aug 29 2018 6:13 PM

ప్రజా విజయం - Sakshi

ప్రజా విజయం

కడప కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గెలుపు ప్రజా విజయంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మేయర్ అభ్యర్థి సురేష్‌బాబు పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు    

కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కడప కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గెలుపు ప్రజా విజయంగా ఆ పార్టీ అధ్యక్షుడు,  మేయర్ అభ్యర్థి సురేష్‌బాబు పేర్కొన్నారు.  వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కడప కార్పొరేషన్‌లో 42 స్థానాలను కైవసం చేసుకున్న సందర్బంగా  మాట్లాడుతూ  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో  తిరుగులేని ఆధిక్యతను అందించారన్నారు.  మిగతా ఎనిమిది డివిజన్లలో  స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు.

మొత్తం మీద 30 వేల పైచిలుకు మెజార్టీ లభించడం సామాన్యమైన విషయం కాదన్నారు. పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడి ఉందని, ఆ ప్రభావమే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇలా ఉండబోవన్నారు. జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందన్న  విశ్వాసం వ్యక్తం చేశారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement