తిత్లీ బాధితులను ఆదుకుంటాం

Hansraj Gangaram Ahir Visit Titli Cyclone Areas Srikakulam - Sakshi

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌

శ్రీకాకుళం , వజ్రపుకొత్తూరు రూరల్‌/ టెక్కలి:తిత్లీ తుపానుతో నష్టపోయిన అందరినీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర హోం శాఖ సహా యమంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ అన్నారు. టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఆయన సోమవారం పర్యటించారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక, డోకులపాడు గ్రామాల్లో పర్యటించిన అయన తుపాను పాడైన కొబ్బరి తోటలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఇంతవరకు నష్టపరిహారం అందలేదని, పూర్తిగా పంటలు, ఇళ్లు నష్టపోయిన తమకు ఎవరూ ఆదుకోలేదని బాధితులు కేంద్రమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కూడా కేంద్ర మంత్రి కలిశారు. నష్టపరిహారాన్ని పెంచాలని, సాముహిక వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, నష్టపోయిన ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని, వ్యవసాయకూలీ కుటుంబాలకు 5 సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేలు భృతి అందించాలని మత్య్సకారులకు తీర ప్రాం తంలో భూములకు పట్టాలు ఇప్పించాలని మండల వైఎస్సార్‌ సీపీ మహిళ కన్వీనర్‌ తామాడ సరస్వతి,జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి, అగ్ని కుల క్షత్రియ జిల్లా ఉపాధ్యక్షుడుయు.

ఉదయ్‌కుమార్‌లు వినతిపత్రాలను అందజేశారు. డోకులపాడులో తుపానుతో దెబ్బతిన్న ఇళ్లను మంత్రి పరిశీలించారు. బాధితులు మడ్డు రాజు, మడ్డు యర్రమ్మలతో మాట్లాడి ఎంత పరిహారం అం దిందని అడిగారు. వారు తమకు రూ.10 వేలు మాత్రమే అందిందని బదులు ఇచ్చారు. అలాగే బత్సలవానిపేట గ్రామానికి చెందిన బత్సల దా లమ్మ తమ అవేదనను హిందీలో చెప్పుకుంది. నష్టం కలిగిన వివరాలను అధికారులకు అందిస్తే న్యాయం చేస్తామని మంత్రి హా మీ ఇచ్చారు. అనంతరం విలేకర్లతో కేం ద్రమంత్రి  మాట్లాడుతూ నష్టపోయిన తీరును చూశానని, ఉద్దాన ప్రజలకు జరిగిన తీవ్ర నష్టం తనను బాధించిందన్నారు. నష్ట తీవ్రతను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులందరినీ ఆదుకుంటామన్నారు. శారదపురంలో రోడ్డుపైన అధిక సంఖ్యలో రైతులు ఉండటం తో వారితో మాట్లాడి పర్యటనను ముగిం చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్, ఎంఎల్‌సీ మాధ వ్, విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కణితి విశ్వనాథం, బీజేపీ పలాస నియోజకవర్గ ఇన్‌చార్జి కొర్రాయి బాలకృష్ణయాదవ్, ఇన్‌చార్జి కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఉన్నారు.

బాధితులను ఆదుకోండి: వైఎస్‌ఆర్‌సీపీ వినతి
టెక్కలి: తుపానుతో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కనీసం కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని వైఎ స్సార్‌సీపీ నాయకులు బగాది హరి, పినకాన వైకుంఠరావు కేంద్ర సహాయ మంత్రి గంగారాం అహిర్‌ను కోరారు.  అయోధ్యపురం జంక్షన్‌ వద్ద కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేశారు. తుపానుతో రైతులు, సామాన్య ప్రజలు పూర్తిగా నష్టపోయారని.. వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్షపాతం చూపిం దని కేంద్రం మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top