ఇంటర్మీడియెట్ పరీక్షలకు అరగంట ముందే అనుమతి | Half an hour before allowed to Intermediate exams | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియెట్ పరీక్షలకు అరగంట ముందే అనుమతి

Mar 6 2014 1:09 AM | Updated on Sep 2 2017 4:23 AM

ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడానికి అరగంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికార వర్గాలు తెలిపాయి

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడానికి అరగంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. సిలబస్ మారిన నేపథ్యంలో కొత్తవారికి కొత్త సిలబస్ ఆధారంగా.. బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ రాసేవారికి పాత్ సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు.
 
 ఇంటర్ తొలి సంవత్సరం పార్ట్-2లోని సెకండ్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, అరబిక్, ఫ్రెంచ్, మరాఠీ, కన్నడ, ఒరియా పేపర్లు.. బైపీసీ విద్యార్థులకు నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్, రెండో సంవత్సరం పార్ట్-3లోని మేథమేటిక్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ్రిడ్జ్ కోర్సు మేథమేటిక్స్ పేపర్లను బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ అభ్యర్థులు పాత సిలబస్ ఆధారంగా రాయడానికి అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement