కదులుతున్న రెలైక్కబోయి గ్యాంగ్‌మన్ దుర్మరణం | Gyangman killed in a train accident | Sakshi
Sakshi News home page

కదులుతున్న రెలైక్కబోయి గ్యాంగ్‌మన్ దుర్మరణం

Sep 5 2013 5:47 AM | Updated on Sep 1 2017 10:28 PM

రైలు నుంచి జారిపడి రైల్వే ఉద్యోగి మరణించాడు. ఈ ఘటన భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగింది.

భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : రైలు నుంచి జారిపడి రైల్వే ఉద్యోగి మరణించాడు. ఈ ఘటన భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగింది.  రైల్వే ఎస్సై ఏఎల్‌ఎస్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గునుపూడిలోని రావూరివారి వీధిలో నివశిస్తున్న కొండూరి సుబ్రహ్మణ్యం (56) స్థానిక రైల్వే పీడబ్ల్యుడీ కార్యాలయంలో గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. 
 
 అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు విజయవాడ వెళ్ళేందుకు భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో నరసాపురం నుంచి గుడివాడ వెళుతున్న ప్యాసింజర్ రైలు రెండో నంబరు ప్లాట్‌ఫారంపై నుంచి కదులుతోంది. ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన సుబ్రహ్మణ్యం కాలు జారి ప్లాట్‌ఫారంకు రైలుకు మధ్య పడటంతో నలిగిపోయి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement